Friday, June 5, 2026
E-PAPER
Homeసినిమాఅంతకుమించి 'దూత 2`

అంతకుమించి ‘దూత 2`

- Advertisement -

అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సూపర్‌ నేచురల్ థ్రిల్లర్ ‘దూత’తో ఓటీటీలో సంచలన అరంగేట్రం చేశారు హీరో నాగచైతన్య. తొలి సీజన్ నాగచైతన్యకు డిజిటల్ ప్రేక్షకుల్లో మరింత గుర్తింపును తీసుకురావడమే కాకుండా, నటుడిగా ఆయనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీతో తన అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, నాగచైతన్య సీక్వెల్ కోసం నిర్మాతగానూ మారుతున్నారు. శరత్ మరార్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. మొదటి సీజన్‌కు ప్రధాన బలంగా నిలిచిన తన అద్భుత కథన శైలితో విక్రమ్ కె కుమార్ రెండో సీజన్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నేడు సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున అక్కినేని క్లాప్ కొట్టి, స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందజేశారు. ‘తండేల్’ బ్లాక్‌బస్టర్ విజయానంతరం ‘వృషకర్మ’ చేస్తున్న నాగచైతన్య తన తదుపరి ప్రధాన ప్రాజెక్ట్‌గా ‘దూత 2’ను ఎంచుకోవడం విశేషం. ఈసారి విక్రమ్ కె కుమార్ మరింత ఉత్కంఠభరితమైన, మిస్టరీతో నిండిన కథను సిద్ధం చేశారు. మొదటి సీజన్‌ను మించిన స్థాయిలో సస్పెన్స్, సైకాలజికల్ థ్రిల్స్, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నారు అని మేకర్స్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -