Saturday, June 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఈజ్ ఆఫ్ లివింగ్ ఉండాలి

ఈజ్ ఆఫ్ లివింగ్ ఉండాలి

- Advertisement -

హెచ్‌ ‌సీ ఎఫ్‌ ఆధ్వర్యంలో ‘సేవ్‌ ‌హైదరాబాద్‌’ నినాదంతో మానవహారం
నవతెలంగాణ – ముషీరాబాద్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాదు.. ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ చెప్పారు. ప్రపంచ పర్యా వరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సిటి జన్స్ ఫోరం (హెచ్ సీ ఎఫ్) ఆధ్వర్యంలో శ్రుక వారం ట్యాంక్ బండ్‌పై “సేవ్ హైదరాబాద్” అనే నినాదంతో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ‌నాగేశ్వర్‌ మాట్లా డుతూ.. ప్రస్తుతం నగరీకరణ వేగంగా పెరుగు తున్నదని, కానీ దానికి తగినట్టుగా మౌలిక సదుపాయాల కల్పన జరగటం లేదని అన్నారు. ప్రభుత్వాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజా సౌకర్యాల కల్పనకు ఇవ్వటం లేదన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు నిర్మాణాలలో గాలి, వెలుతురు వచ్చేలా ఉండాలని, దాని వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుందని సూచించారు. ఈ మొబిలిటీ పెరగాలని దానివల్ల శిలాజ ఇంధనా ల వినియోగం తగ్గుతుందని, కాలుష్యాన్ని తగ్గిం చొచ్చని చెప్పారు. భూగర్భం, గాలి, నీటి వనరులు కాలుష్యం అవుతు న్నాయని, డ్రయినేజీని యథేచ్ఛగా మంచినీటి చెరువుల్లో వదులుతున్నార ని, ఫలితంగా మంచినీటి వనరులు కలుషితమ వుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైద రాబాదులో హుస్సేన్ సాగర్, మూసీ శుద్ధి కార్యక్ర మాల గురించి అనేక సంవత్సరా లుగా వింటు న్నాం కానీ ఆచరణకు నోచుకోవటం లేదన్నారు. నగరం అభివృద్ధికి కేంద్రాలని, పర్యావరణహితం గా నగరాభివృద్ధి జరగాలని, అప్పుడే ప్రజలకు దీర్ఘకాలికంగా ఆర్థికవ్యవస్థకు ఉపయోగమన్నారు.

అర్బన్ డెవలప్‌‌మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్ష ణకు ప్రతి ఒక్కరూ 100 చెట్ల చొప్పున నాటాలని అన్నారు. రోజురోజుకూ ఎండల తీవ్రత విపరీ తంగా పెరుగుతోందని, దీన్ని బట్టే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అర్బన్ ప్లానింగ్ లో అనేక మార్పులు రావాలని, ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అందుకు హెచ్ సీ ఎఫ్, యూడీఎఫ్ లాంటి పౌర సంస్థలు కృషి చేయాలని కోరారు. హెచ్‌‌సీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు మల్లం రమేష్ వందన సమర్పణ చేశారు. గ్లోబల్ వార్మింగ్ నివారించాలని, ప్లాస్టిక్ ను నియంత్రించాలని, హుస్సేన్ సాగర్, మూసీ శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, కాలుష్యాన్ని నివారించాలని ప్లకార్డు లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఆర్. మాణిక్, హెచ్ సీ ఎఫ్ కార్యకర్తలు ఎం.శ్రీనివాస రావు, పి.నాగేశ్వరరావు, పి.శ్రీనివాసరావు, మోహన్ నాయుడు, సంగీత, అస్మిత, లలిత, రితేష్, సుకుమార్, గోపాల్, మోహన్, నర్సింగ్ రావు, శ్రీవల్లి, శంకర్, రమేష్, శంకరయ్య, రఘు, సైదులు, శ్రీనివాస్, కృష్ణమోహన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -