Tuesday, February 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమ కార్యాచరణ

ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమ కార్యాచరణ

- Advertisement -

– ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సర్వీస్‌ రూల్స్‌ తదితర సమస్యలపై ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్టు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ టీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. రాష్ట్ర సంఘం అధ్యక్షులు దామోదర్‌ రెడ్డి సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సంఘం వ్యవస్థాపకులు సామల యాదరిగి విగ్రహాన్ని శ్రీపాల్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌ రెడ్డి మాట్లాడుతూ పీఆర్టీయూ టీఎస్‌ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని పెంచిన సంఘమనీ, అనేక సదుపాయాలను సాధించిపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్‌, సామల యాదగిరి కుటుంబ సభ్యులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -