మండలంలో 52 దరఖాస్తులు, 09 యూనిట్లు మంజూరు
నవతెలంగాణ – మల్హర్ రావు
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ పథకాన్ని అమలు చేస్తోంది.ఈ పథకం పొందాలంటే బ్యాంక్ ఆమోదంతో పాటు ముందస్తుగా బ్యాంక్ లో కొంత నగదు జమ చేసిన వారికే బ్యాంకర్లు ఎస్సీ కార్పొరే షన్ పథకంలో రాయితీ కల్పిస్తారు ప్రస్తుతం ఎక్కువ రాయితీతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉపాధి కల్పించే దిశగా ఎలక్ట్రిక్ ఆటోలు, స్కూటీలు,సోలార్ పంపు సీట్లు, గేదెలు తదితర ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా యూనిట్లను ఏర్పాటు చేశారు.
మండలంలో 15 గ్రామ పంచాయతీల నుంచి 52 మంది దళితులు దరఖాస్తు చేసుకుంటే కేవలం 09 యూనిట్లకే పరిమితం అయ్యాయి.మంజురైన యూనిట్లను ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారికి,గతంలో దళితబందు పొందిన వారికి,అర్హులైన పేదలకు కాకుండా చోటమోట నాయకులు పైరవీలు చెసిన వారికే ఎస్సీ కార్పొరేషన్ రుణాలను అందిస్తున్నారనే ఆరోపణలు వినిపించడంతో అర్హులైన పేదలు ఆందోళనకు గురివుతున్నట్లుగా తెలుస్తోంది.ఎస్సీ కార్పొరేషన్ రుణాలు విడుదల కాక సుమారు రెండు దశాబ్దాలు కావొస్తోంది కావున ఉన్నతాధికారులు స్పందించి ఆర్థిక స్తోమత లేని దళిత కుటుంబాలకు ఎస్సి కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.
మండలంలో ఇలా..
దరఖాస్తులు – 52
మంజూరైన యూనిట్లు – 09
ఎలక్ట్రికల్ ఆటోలు – 27
ఎలక్ట్రికల్ స్కూటీలు – 17
గెదలు – 05
సోలార్ పంపుసెట్లు – 03
పారదర్శకంగా ఎంపిక చేశాం: ఎంపీపీఓ క్రాంతికుమార్
ఎస్సీ కార్పొరేషన్ ఋణాలకు దరఖాస్తు చేసుకున్న వారందరిలో పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి జిల్లా ఉన్నతాధికారులకు జాబితా పంపించాం. మొత్తం 09 యూనిట్లను ఎంపిక చేశాం. ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదు. పూర్తిగా అర్హులనే ఎంపిక చేశాం.



