Tuesday, February 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ శివారులో భూకంపం

హైదరాబాద్ శివారులో భూకంపం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో ఉదయం 10:10 గంటలకు భూమి కంపించింది. గాజులరామారంలోని మెట్‌ఖాన్‌గూడా ప్రాంతంలో భూకంపం వచ్చిందని స్థానికులు తెలిపారు. పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ల నుంచి భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంప శబ్దమా లేక ఇతర పేలుడు పదార్థాల కారణమా అనే అంశంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మేడ్చల్‌ జిల్లాలో పలుచోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్, గాజులరామారం డివిజన్ మెట్‌ఖాన్‌ గూడ ప్రాంతాల్లో భూమి కంపించింది. భయంతో జనం ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. పెద్ద శబ్దంతో భూమి కంపించిందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. రెప్పపాటులో జరిగిన ఘటనతో ఇళ్లలోని వస్తువులు కదిలిపోయాయి. దీంతో జనం బయటకు పరుగులు తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -