Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సింగంపల్లి బ్రిడ్జికి కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి పోయలే

సింగంపల్లి బ్రిడ్జికి కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి పోయలే

- Advertisement -

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రింగ్‌రోడ్డు పూర్తి చేసి,11బ్రిడ్జిలు కట్టించాం
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
నవతెలంగాణ – మల్హర్ రావు 

మహాముత్తారం మండలం సింగంపల్లి గ్రామంలోనీ బ్రిడ్జి అప్రోచ్‌ వాల్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి పోయించలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ తీవ్రంగా విమర్శించారు. శనివారం మహాముత్తారం మండలం సింగంపల్లి బ్రిడ్జిని ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ హయాంలో బ్రిడ్జి మంజూరైతే దానిని కట్టలేకపోయారని కాంట్రాక్టర్‌ మద్యలోనే వెళ్లపోయిండని, శిలా ఫలకం కూడా ఇక్కడే ఉందని గుర్తు చేశారు.ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌  నాయకత్వంలో పంకెన వయా మోదేడు సింగంపల్లి రోడ్డుకు రూ. 25కోట్లు పైచిలుకు నిధులు తీసుకువచ్చి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయగా అటు ఇటు అప్పోచ్‌ వాల్‌ నిర్మాణ పనులు మిగిలిపోయాయని, ఆ పనులను మూడు ఏండ్లకు దగ్గరకు వచ్చిన ఈ పనులు పూర్తి చేయని పరిపాలన కాంగ్రెస్ దని ఎద్దేవా చేశారు.

మంథని  పట్టణంలోని ఆడబిడ్డల ఆస్పత్రిని సక్కగా చూడకుండా కనీసం వైద్యులను నియమించలేదని, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు రవాణా సౌకర్యాలు చూడకుండా వారి స్థతిగతులు పట్టించుకోవడం లేదన్నారు.అసలు సింగంపల్లి,నీలంపల్లి, సర్వాయిపేట, పెద్దంపేట వద్ద బ్రిడ్జిలు ఎప్పుడు పూర్తి అయినవో చెప్తారని ప్రశ్నించారు.పంకెన మోదేడు సింగంలపల్లి రింగ్‌రోడ్డు పూర్తి చేసి 11బ్రిడ్జిలను కట్టించామన్నారు. అప్రోచ్‌ వాల్‌కు తట్టెడు మట్టి పోయని   కాంగ్రెస్ బ్రిడ్జిలు, రింగ్‌రోడ్‌ కట్టామని చెప్పడం సిగ్గు చేటున్నారు.ఈ విషయంలో కాంగ్రెస్సోళ్లకు సోయి ఉంటే ఆలోచన చేయాలన్నారు.

నిత్యం ముఖ్యమంత్రి పక్కనే ఉంటున్న మంథని ఎమ్మెల్యే కనీసం అభివృద్ది పనులు చేయకుండా కాలాన్ని వృదా చేస్తున్నాడని, మమ్మల్ని తిట్టించుడు కేసులు పెట్టించుడు మానుకోవాలని ఆయన హితవు పలికారు. వర్షాకాలం వస్తుందని, గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు పడుతరనే విషయాన్ని మంథని ఎమ్మెల్యే గమనించాలన్నారు. ఈ మట్టిలో పుట్టి కన్నీళ్లు కష్టాలు తెలుసు కనుకనే అధికారంలో ఉన్నప్పుడు అన్నీ పనులు చేశామని, ప్రతిపక్షంలో మీ మెడలు వచ్చి పని చేయించే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టించి పోలీసులతో భయపెట్టించే ప్రయత్నం చేసినా  పోరాటం ఆగదని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -