Sunday, June 7, 2026
E-PAPER
Homeహెల్త్చేపలతో బోలెడు ఆరోగ్యం

చేపలతో బోలెడు ఆరోగ్యం

- Advertisement -

చేపలు మానవ శరీరానికి అవసరమైన అత్యుత్తమ ప్రోటీన్‌, విటమిన్లను అందించే సహజ సిద్ధమైన ఆహారం. భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ వంటి ప్రాంతాలలో మంచినీటి చేపలకు చాలా ప్రాధాన్యం ఉంది.

బొచ్చె (Rohu/ Catla): తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ చేప వేగంగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది.
బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.
ఎముకలు – దంతాలు: ఇందులో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి, పంటి గట్టితనానికి ఎంతో మేలు చేస్తుంది.
కంటి చూపు: ఇందులో విటమిన్‌ ‘A’ (రెటినోల్‌) పుష్కలంగా ఉండటం వల్ల రేచీకటి వంటి సమస్యలు రాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ఖనిజ లవణాలు: ఇందులో జింక్‌, ఐరన్‌, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.
కొరమీను (Murrel/ మట్టె) : దీనిని తెలంగాణ ‘స్టేట్‌ ఫిష్‌’ (రాష్ట్ర చేప) గా గుర్తించారు. ఇది కేవలం రుచిలోనే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో విశిష్టమైనది.
గాయాలు మానడం: ఇందులో అధికంగా ఉండే ప్రోటీన్‌, గ్లైసిన్‌ వంటి అమినో యాసిడ్లు శరీరంలోని గాయాలను త్వరగా మానిపిస్తాయి.
శస్త్రచికిత్స తర్వాత: ఆపరేషన్‌ అయిన రోగులు త్వరగా కోలుకోవడానికి (recovery) వైద్యులు సైతం ఈ చేపను తినమని సూచిస్తారు.
మెదడు – చర్మ ఆరోగ్యం: ఇందులో A, ణ3, దీ12, జ విటమిన్లు, ఐరన్‌ ఉండటం వల్ల జ్ఞాపకశక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బాసా చేప (Apollo Fish) : బాసా చేపలో ముల్లులు చాలా తక్కువగా ఉండటం వల్ల దీనిని ‘అపోలో ఫిష్‌’ గా కూడా పిలుస్తారు. చిన్న పిల్లలకు, వద్ధులకు ఇది చాలా సురక్షితమైన ఆహారం.
కండరాల పుష్టి: కండరాల వృద్ధికి, శరీర నిర్మాణానికి(body building) కావలసిన ప్రోటీన్‌ ఇందులో లభిస్తుంది.
గుండె – కీళ్ల ఆరోగ్యం: ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను రక్షిస్తాయి, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
మానసిక శక్తి: మెదడు పనితీరును వేగవంతం చేసి ఏకాగ్రతను పెంచుతుంది.
సాల్మన్‌ చేప (Salmon Fish) : ఇది ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యంత పోషక విలువలున్న చేపలలో ఒకటి.
ఒమేగా-3 నిధి: సాల్మన్‌ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అత్యధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల వాపులను (inflammation) తగ్గించి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తాయి.
విటమిన్‌ ణ, దీ కాంప్లెక్స్‌: ఎముకల బలానికి విటమిన్‌ ణ, ఆహారాన్ని శక్తిగా మార్చడానికి ఉపయోగపడే విటమిన్‌ దీ కాంప్లెక్స్‌ (దీ12, దీ6) ఇందులో సమద్ధిగా ఉంటాయి.
జుట్టు సంరక్షణ: ఇందులోని ఖనిజాలు జుట్టు రాలడం తగ్గించి, దఢంగా పెరగడానికి తోడ్పడతాయి.
ముఖ్యమైన గమనికలు (Health Tips):
న చేపలను నూనెలో డీప్‌ ఫ్రై చేయడం వల్ల వాటిలోని పోషకాలు నశించే అవకాశం ఉంటుంది.
న చేపలను పులుసు లేదా కూర రూపంలో వండుకుని తినడం అత్యంత శ్రేయస్కరం.
న వీలైనంత వరకు తాజా మంచినీటి చేపలను ఎంచుకోవడం వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

వాణి అయోధ్య
క్లినికల్‌ డైట్‌ కన్సల్టంట్‌
9959361180

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -