నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ పాత మండలంలోని బాబుల్ గావ్ పెద్ద రోడ్డుపై చిరుత పులి పిల్లకూన కనిపించిందని గ్రామస్థులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇటీవలే దోస్త్ పల్లి గ్రామంలో ఒక మగ చిరుత పులిని విష ప్రయోగం చేసి చంపేసిన విషయం పాఠకులకు తెలిసింది. చిరుత పులి మండలాలైన మద్నూర్, పెద్ద కొడప్ గావ్ మండలంలోకి ప్రవేశించినట్టు అక్కడ రోడ్లపై పిల్ల కూనాలతో సంచరించినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ విషయం ట్టుపక్కల గ్రామాలకు పాకడంతో గ్రామాల ప్రజలు బయట తిరగాలంటే జంకుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు బంగారు పల్లి, దోస్తుపల్లి, మైబాపూర్, శక్తి నగర్, పెద్దగుళల్లా గ్రామాలలో ఫారెస్ట్ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
బాబుల్ గావ్ లో చిరుత సంచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



