నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని డోన్గావ్ గ్రామ పంచాయతీ కార్యాలయం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవలే నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కె, శ్రీనివాస్ ఎంపీడీవో శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో తన వంతుగా కృషి చేస్తానని ఎంపీడీవోకు హామీ ఇచ్చారు.
తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో మండల స్థాయి అధికారుల సహాయ సహకారాలు పూర్తిగా లభించినప్పుడే సర్పంచ్ గా తన బాధ్యతలను అభివృద్ధి బాటలో తీసుకువెళ్లడం సునాయాసంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఎంపీడీవోను గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని రికార్డులను గ్రామపంచాయతీ కార్యదర్శి అంజయ్య చూపించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్ది పరిశుభ్రతను పాటించాలని సూచించారు. శానిటేషన్ పనులు నిత్యం పర్యవేక్షించి సమస్యలు తలెత్తకుండా గ్రామ ప్రజలకు నిత్యం సేవలందించాలని గ్రామ సెక్రెటరీ కి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కే.శ్రీనివాస్, జిపి కార్యదర్శి అంజయ్య, జిపి పాలకవర్గ సభ్యులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



