మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం
ఫైనల్లో ఫాలిన్‌స్కాకు భంగపాటు
పారిస్ (ఫ్రాన్స్) : రష్యా అమ్మాయి మిరా అండ్రీవవా (19) మట్టికోర్టు కిరీటం దక్కించుకుంది. శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ పొలాండ్ చిన్నది మయా ఫాలిన్‌స్కాపై 6-3, 6-2తో వరుస సెట్లలో అండ్రీవ ఘన విజయం సాధించింది. ఒక గంట 22 నిమిషాల పాటు సాగిన టైటిల్ పోరులో ఫాలిన్‌స్కాకు పొలాండ్ అభిమానుల మద్దతు విశేషంగా లభించింది. హోటల్ అద్దె చెల్లించలేని దీన స్థితిలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్న ఫాలిన్‌స్కా విజయం కోసం అభిమానులు కోర్టులో కేరింతలు కొట్టారు. కానీ రష్యా భామ అండ్రీవా ఓపిగ్గా ఆడింది. ఎక్కడా సహనం కోల్పోలేదు. ఏడు సార్లు ఫాలిన్‌స్కా సర్వ్ బ్రేక్ చేసిన అండ్రీవా.. పాయింట్ల పరంగా 62-41తో పైచేయి సాధించింది. అండ్రవా 25 విన్నర్లు కొట్టగా.. ఫాలిన్‌స్కా 10 విన్నర్లతో సరిపెట్టింది. క్వాలిఫయర్స్ నుంచి గ్రాండ్‌ఫైనల్ వరకు చేరుకున్న ఫాలిన్‌స్కా ఓడినా అభిమానుల హృదయాలను గెల్చుకుంది. అండ్రీవ కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో రూ.30 కోట్లు నగదు బహుమతి దక్కించుకోగా.. ఫాలిన్‌స్కా రూ.15 కోట్లు ఖాతాలో వేసుకుంది. మోనికా సీల్స్ (1992), ఇగా స్వైటెక్ (2020) ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన టీనేజర్‌గా అండ్రీవా నిలిచింది.
నేడు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫ్లావియో కొబాలి (ఇటలీ)తో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) తలపడనున్నాడు. సాయంత్రం 6.30 గంటలకు టైటిల్ పోరు ఆరంభం కానుంది.
ఫ్రెంచ్ క్వీన్ మిరా అండ్రీవా
- Advertisement -
- Advertisement -



