నవతెలంగాణ -రాయికల్
పట్టణంలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మంగళవారం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుధామారావు, జెడ్పిసీఈవో (ప్రత్యేక అధికారి) గౌతం రెడ్డి పరిశీలించారు.
ఈ ఎన్నికల విధుల్లో పోలింగ్ ఆఫీసర్లు 24 మంది,అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 96 మంది,ప్రిసైడింగ్ ఆఫీసర్లు 24 మంది,రిటర్నింగ్ అధికారులు 4,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 4 మంది, జోనల్ ఆఫీసర్లు ముగ్గురితో పాటు ఇతర సిబ్బంది పాల్గొననున్నట్లు మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు తెలిపారు.
- పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు ఈ విధంగా ఉన్నాయి
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) ఆవరణలో 1, 2, 9, 10, 12 వార్డులకు సంబంధించి 10 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 4, 5, 11 వార్డులకు 6 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
మత్తడివాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఉర్దూ మీడియం)లో 6వ వార్డు కోసం 2 పోలింగ్ స్టేషన్లు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఒడ్డెర కాలనీలో 8వ వార్డుకు 2 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అలాగే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఇందిరానగర్ కాలనీలో 3వ వార్డుకు 2 పోలింగ్ స్టేషన్లు, పురపాలక సంఘ కార్యాలయంలో 7వ వార్డుకు సంబంధించి 2 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.



