నవతెలంగాణ – మునుగోడు
ఈనెల 14న నల్గొండ పట్టణ కేంద్రంలోని ఏచూరి గార్డెన్ నిర్వహించిన రైతు సంఘం 24వ మహాసభలో నల్లగొండ పట్టణ కేంద్రంలో జరిగింది. ఈ మహాసభలో మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి చెందిన సాగర్ల మల్లేష్ ను రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సమస్యలపై, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి వడ్లను తాలు పట్టిన, మిల్లర్లు తాలు పేరుతో కోత పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేశారు. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోకుండా నకిలీ విత్తనాలపై నిఘా పెట్టి నకిలీ విత్తనాలను విక్రయించే వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర , జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడిగా సాగర్ల మల్లేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


