Sunday, June 7, 2026
E-PAPER
Homeజిల్లాలుఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

 నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కలిసి పదవ తరగతి చదువుకున్న 2000-01 సంవత్సరం పూర్వ విద్యార్థులు అందరు కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ బంకిట్ హాల్  వేదికయ్యింది. 25 సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విద్యాబుద్దులు నేర్పిన గురువులను, తోటి మిత్రులను ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో జరిగిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి గురువులను పూలమాలలతో,శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులంతా ఒకచోట కలవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను తాము మర్చిపోయిన, తమను మాత్రం మర్చిపోకుండా ఆహ్వానాన్ని పలకడం తమకు ఎంతో గర్వమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -