- Advertisement -
నవతెలంగాణ – చిన్నకోడూరు : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కమ్మర్లపల్లి గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి 20 లక్షల వ్యయంతో గ్రామ సర్పంచ్ రేగుల శ్యామల దేవయ్య భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. నూతన గ్రామపంచాయతీ ఏర్పడడం అభినందనీయం అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగని సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కప్పెర శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు పిల్లి పవన్, రాములు, కొట్టపల్లి విజయ పరిషరాములు, యాదగిరి, నాయకులు నమూండ్ల హరీష్ , వినోద్, కుమార్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



