Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐఐటి నీట్ లో రాష్ట్రస్థాయిలో మెరిసిన సర్ సి.వి రామన్ విద్యార్థులు

ఐఐటి నీట్ లో రాష్ట్రస్థాయిలో మెరిసిన సర్ సి.వి రామన్ విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
తెలంగాణ రాష్ట్రంలోని ఈ  అభ్యాస్ అకాడమీ నిర్వహించిన  ఐ.ఐ టి మరియు నీట్  పరీక్షలలో హుస్నాబాద్ లోని సర్ సి.వి రామన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. బుధవారం పాఠశాల ప్రిన్సిపల్ కాయిత నారాయణరెడ్డి  విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో బహుమతులు ప్రధానం చేసినట్లు తెలిపారు. ఈ – అభ్యాస్ అకాడమీ వారు నిర్వహించిన ఐ.ఐ.టి మరియు నీట్ పరీక్షలలో 300 పాఠశాలలు పాల్గొంటే సర్ సి.వి రామన్ ఉన్నత పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విద్యార్థులు  రాష్ట్ర స్థాయి బహుమతులు సాధించడం అభినందనీయం అన్నారు.

మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, బిజినెస్ ఆప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ వంటి అంశాలలో నిర్వహించిన ఒలింపియాడ్ లలో రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ,తృతీయ ర్యాంకులను సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఇలాంటి బహుమతులు సాధించవచ్చని అన్నారు. ఉల్లి శ్రీ హర్షిణి,  వేముల కార్తీక, మెరుగు సంక్షిప్త్ , పోగుల సుహాస్ శౌర్య, గుండు అగస్త్య నందన్, అనంతోజు హిమాన్సిక, పెనుకుల వైనవి, వేముల కార్తీక, పున్న అరూహి, పచ్చిమట్ల నందిని, బుర్ర శ్రీనిధి, ఠాకూర్ వర్షిత ,కానవేని కార్తీక , కాసనగొట్టు తేజా శ్రీ,పోగుల రిత్విక్, సున్నం శృతిక,  అనంతోజు శ్రీ చరిత్ లు  ఈ బహుమతులు అందుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ నారాయణరెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -