నవతెలంగాణ – పెద్దవూర
పోషణ పక్వడ కార్యక్రమంలో భాగంగా బుధవారం అనుముల ఐసీడీఎస్ పరిధిలోని పెద్దవూర మండలం చలకుర్తి సెక్టార్ కుంకుడు చెట్టు గ్రామంలోఉన్న అంగన్వాడీ కేంద్రాలలో పాలిచ్చే తల్లులకు శిశువుల పోషణ పై సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలకు పరిపూర్ణ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ గౌసియా బేగం మాట్లాడుతూ మహిళలు, గర్భిణీలు, కిశోర బాలికలు, చిన్నారులకు పోషకాలు ఉన్న సమతుల్య ఆహారం అందిస్తేనే భవిష్యత్తులో రోగాలు దరి చేరవని, ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
పోషకాహారం వల్ల కలిగే ఆరోగ్యం గురించి క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్య పరుస్తున్నామన్నారు. కిషోర బాలికలకు రక్తహీనత పరీక్షలు జరీపి పోషకాహర ఆహారం తీసుకోవాలని తెలిపారు.పిల్లలు గర్భిణీలు బాలింతలు కౌమార దశలోని బాలికలు తీసుకోవాల్సిన అంశాలను వివరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లక్ష్మి,శారద గ్రామస్తులు,అంగన్వాడీ లబ్ధిదారులు ఉన్నారు.



