Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ సింగిల్ విండో పరిధిలోని కొత్తచెరువు తండా గ్రామ పంచాయతీలో, కోన సముందర్ సింగిల్ విండ పరిధిలోని ఈనాయత్ నగర్, అమీర్ నగర్ గ్రామాలలో బుధవారం ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, ఆయా గ్రామాల సర్పంచులతో  కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన ప్రకారం సన్నపు వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చామని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని అన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిసర ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్ముకొని రైతులు నష్టపోవద్దని కోరారు. వరి ధాన్యం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకు రూ.2389, కామన్ రకం క్వింటాల్ ధాన్యానికి రూ.2369 చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో కోనాపూర్ సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి, కొత్త్తత చెరువు తండా సర్పంచ్ లకావత్ సంతోష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు సుంకేట రవి, సింగిల్ విండో ప్రత్యేక అధికారి రమణ్ కుమార్, ఐకేపీ ఏపీఎం కిరణ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జేడీ మధులత శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, ఐకేపీ సిసిలు ఏడేల్లి రవి, భాగ్యలక్ష్మి, పిర్య నాయక్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -