తాడేపల్లి : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడు కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు రావడంతో నలుగురి జీవితాల్లో వెలుగులు పంచినట్లయింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన కందిమల విజయకుమార్ (20) ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కెఎల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 6వ తేదీన తాడేపల్లిలోని డిమార్ట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి తలలో రక్తస్రావం జరిగిందని గుర్తించారు. చికిత్స అందించినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. మరిన్ని వైద్య పరీక్షలు చేసిన అనంతరం బుధవారం బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. అవయవ దానం గురించి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. కుటుంబ సభ్యుల అంగీకరించడంతో ఎపి జీవన్‌దాన్ చైర్మన్ కె.రాంబాబు, మణిపాల్ ఆస్పత్రి డైరెక్టర్ రామాంజనేయరెడ్డి నేతృత్వంలో అవయవ దానం జరిగింది. విజయవాడ (తాడేపల్లి)లోని మణిపాల్ ఆస్పత్రిలో గుండె, కాలేయం అవసరమైన వారికి ట్రాన్స్ ప్లాంటేషన్ నిర్వహిస్తారు.
తాను మరణించి…నలుగురు జీవితాల్లో వెలుగులు పంచి…
- Advertisement -
- Advertisement -



