Thursday, February 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐఏఎస్‌ల బదిలీలు

ఐఏఎస్‌ల బదిలీలు

- Advertisement -

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌
మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌ నూతన మున్సిపల్‌ కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణలో పది మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌ నియమితులయ్యారు. ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్‌ బాధ్యతలు
చేపట్టనున్నారు. ఆయన గిరిజన సంక్షేమ ప్రత్యేక సీఎస్‌గానూ కొనసాగుతారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్‌కుమార్‌ సుల్తానియాకు ప్రణాళికా శాఖతో పాటు తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సెర్ప్‌ అడిషనల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కాత్యాయనీదేవికి ప్రజావాణి రాష్ట్ర నోడల్‌ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అమె స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ జేఎమ్‌డీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు.

సెర్ప్‌ సీఈవోగా పనిచేస్తున్న డీ దివ్యకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. అక్కడ పనిచేస్తున్న శృతి ఓజాను రిలీవ్‌ చేశారు. జలమండలి జేఎండీగా మయాంక్‌ మిట్టల్‌ నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా రఘురామ్‌శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మంత్రి శ్రీధర్‌బాబు ఓఎస్‌డీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ కొనసాగుతారు. నూతనంగా ఏర్పడిన సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లుగా జీహెచ్‌ఎంసీలో అడిషనల్‌ కమిషనర్లుగా పనిచేస్తున్న జీ శ్రీజన, టీ వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -