చిత్ర పరిశ్రమలో నూతన ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ప్రెస్ మీట్ లో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ‘ఇండస్ట్రీ మీద ఎన్నో ఆశలతో రోజూ కొత్త వారు వస్తున్నారు. వారికి తమ కంటెంట్ ను ఎలా ప్రదర్శించాలి, తమ ప్రతిభను ఎలా చూపించాలనేది తెలియడం లేదు. అలాంటి యంగ్ టాలెంట్ కోసం టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 నిర్వహిస్తున్నాం. గత నెలలో మేము ప్రకటన చేసినప్పటి నుంచి భారీగా ఎంట్రీలు వస్తున్నాయి. వీలైనంత ఎక్కువమందికి ప్రోత్సాహం అందించాలని మొదటి ఐదు స్థానాలకు అవార్డ్స్ ఇస్తున్నాం. మొదటి ముగ్గురు విజేతలకు నగదు బహుమతి కూడా ఉంటుంది. దాదాపు 30 కేటగిరీలు ఉన్నాయి. మొదటి బహుమతిగా 10 వేలు, రెండో బహుమతిగా 7500, మూడో బహుమతిగా 5000 రూపాయలు ఇస్తాం. మేము దీని కోసం ఎవరి దగ్గరా ఎంట్రీ ఫీజు తీసుకోవడం లేదు. ఉచితంగా మీ కంటెంట్ పంపవచ్చు. ఈ నెల 13వ తేదీ వరకు సమయం ఉంది. ఈ నెల 21న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఈవెంట్ నిర్వహిస్తాం. ఈ అవార్డుల కమిటీ జ్యూరీకి నటి ఇంద్రజని ఛైర్ పర్సన్ గా ఎంచుకున్నాం. ప్రేక్షకుల్లో ఆమెకున్న మంచి గుర్తింపు మా అవార్డ్స్ కు కూడా క్రేజ్ తీసుకొస్తుందని నమ్ముతున్నాం. ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారు కూడా తమ ఎంట్రీలను పంపవచ్చుఅని అన్నారు. 'కంటెంట్ క్రియేట్ చేయడమే కాదు. అది ప్రదర్శించే వేదిక బాగుండాలి. టీఎఫ్ సీసీ లాంటి పేరున్న అసోసియేషన్ ద్వారా మీ కంటెంట్ ప్రదర్శితమైతే అది అందరికీ చేరువ అవుతుంది. ఇది నూతన ప్రతిభకు గొప్ప అవకాశం అని నటి ఇంద్రజ చెప్పారు.
నూతన ప్రతిభకు గొప్ప అవకాశం
- Advertisement -
- Advertisement -



