Wednesday, June 10, 2026
E-PAPER
Homeసినిమానవ్వించే 'అనుమాన పక్షి`

నవ్వించే ‘అనుమాన పక్షి`

- Advertisement -

రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ దర్శకత్వంలో చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘అనుమాన పక్షి’ అనే యూనిక్ కామెడీ రూపొందుతోంది. రాగ్ మయూర్‌ హీరోగా రాజీవ్ చిలక, రాజేష్ జగతియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటిస్తున్నారు. రమణ గోగుల ఆలపించిన మొదటి పాట ‘గులాబ్ జామ్’ ఇప్పటికే చార్ట్‌ బస్టర్‌గా నిలిచింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లో రాగ్ మయూర్ పోషించిన పాత్రను పరిచయం చేశారు. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ, తన తల్లి దండ్రులను, ప్రేయసిని కూడా అను మానించే స్వభావం ఉన్న యువకుడిగా కనిపించిన తీరు ఆకట్టుకుంది. అతని ఈ అనుమాన స్వభావం వల్ల వరుసగా జరిగే విచిత్రమైన, హాస్యభరితమైన, గందరగోళ సంఘటనలతో కథ ఆసక్తి కరంగా ముందుకు సాగుతుంది అని మేకర్స్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -