Wednesday, June 10, 2026
E-PAPER
Homeసినిమాముంబయిలో కీలక షెడ్యూల్ పూర్తి

ముంబయిలో కీలక షెడ్యూల్ పూర్తి

- Advertisement -

హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న పాన్-ఇండియా సినిమా ‘ఎస్ వై జీ(సంబరాల ఏటిగట్టు). 'హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న చిత్రమిది.
రోహిత్ కె.పీ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ముంబయి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ షెడ్యూల్‌లో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు పాల్గొనడం చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది అని మేకర్స్ తెలిపారు. ‘హనుమాన్` విజయంతో భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని మరింత భారీగా నిర్మిస్తోంది. ఇప్పటికే పూర్తైన ప్రతి షెడ్యూల్ ఈ ప్రాజెక్ట్ తాలూకా భారీ స్థాయి, గొప్ప విజన్‌ను ప్రజెంట్ చేస్తోంది. అద్భుతమైన ప్లానింగ్, భారీ నిర్మాణ విలువలు, భారీ తారాగణంతో ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ భారీ చిత్రంలో సాయి దుర్గా తేజ్ తన కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడిన పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో అందరినీ మెస్మరైజ్ చేశారు. ఈ చిత్రం ఆయన సినీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ప్రపంచ స్థాయి థియేట్రికల్ అనుభూతిని అందించే చిత్రంగా తీర్చిదిద్దేందుకు మేకర్స్ ఎలాంటి రాజీ లేకుండా నిర్మిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -