నవతెలంగాణ-కుభీర్
ఇటీవల వెలువడిన జేఈఈ, అగ్ని వీర్ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన యువకులకు బుధవారం గ్రామస్తులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జేఈఈ లో రెడ్డి శెట్టి హర్షిత్, అగ్ని వీరిలో ప్యాట హరి ప్రసాద్, వడ్నం విష్ణువర్ధన్ దేశ సేవలో ప్రతిభ కనబరిచి గ్రామ యువకులకు ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాల్లో అగ్ని వీర్ ఫలితాల్లో ప్రతిభ సాధించిన యువకులకు ఆదర్శంగా తీసుకొని మరిన్ని ఉద్యోగాలు యువకులు సాధించేలా పట్టుదలతో కృషి చేయాలని గ్రామస్తులు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ విఠలేశ్వర ఆలయ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ పెంటాజి నాగలింగం, మల్లేష్ బాలాజీ, రెడ్డి శెట్టి ఆనంద్,సాయినాథ్, పి విజయ్ కుమార్ దత్తాత్రి, శంకర్ గజ్జు పటేల్, బక్కన్న, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
గ్రామంలో మరిన్ని ఉద్యోగాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



