Thursday, June 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలైంగిక దాడికి గురైన బాలికకు ఐద్వా,టీఆర్‌‌వీఎస్‌ నేతల పరామర్శ

లైంగిక దాడికి గురైన బాలికకు ఐద్వా,టీఆర్‌‌వీఎస్‌ నేతల పరామర్శ

- Advertisement -

ఆమెకు మెరుగైన వైద్యం అందించాలి : నిందితుణ్ని కఠినంగా శిక్ష‍ించాలని డిమాండ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఖమ్మం పట్టణం, రాపర్తి నగర్‌‌లో ఈనెల 7న లైంగికదాడికి గురై నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైనర్‌ ‌బాలికను ఐద్వా, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నేతలు బుధవారం పరామర్శించారు. బాలిక పరామర్శించిన బృందంలో ఐద్వా అధ్యక్ష‍, ప్రధాన కార్యదర్శులు మల్లు లక్ష్మి , ఆర్‌ అరుణజ్యోతి, ఉపాధ్యక్ష‍ులు ఆశాలత, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియాల గోపాల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష‍ులు ముదిగొండ రాంబాబు, నాయకులు పెద్దాపురం భాస్కర్‌, కేశరాజు యాదగిరి,గోపి తదితరులు ఉన్నారు. నిమ్స్‌‌లో బాధిత బాలికను, తల్లి దండ్రులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన గౌస్ పాషాను ఫోక్సో కేసు నమోదు చేసి ఫాస్ట్‌ ‌ట్రాక్‌ ‌కోర్దు ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేశారు. బాలికపై లైంగికదాడికి పాల్పడటమే కాకుండా అపార్టుమెంట్‌‌పై తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తీవ్రమైన గాయాలతో బాధపడుతున్న బాలికను ఖమ్మం ప్రయివేట్‌ ఆస్పత్రి నుంచి నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ‘రెండు చేతులు, రెండు కాళ్లు విరిగాయి. వెన్నుముక, పక్కటెముకలు విరిగిపోయాయి. బాలిక చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతూన్నది.ఈ దారుణం జరిగి నాలుగు రోజులవుతున్న ప్రభుత్వ అధికారులు, పోలీస్ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. బాలికకు వైద్యంతోపాటు భవిష్యత్తులో ఆ పాప ఆరోగ్యంగా ఉండేందుకు వైద్య నిమిత్తం, విద్య కోసం కోటి రూపాయలు ఆర్థిక సహకారం ప్రభుత్వం అందించాలని కోరారు. నిరుపేద కుటుంబానికి ఉపాధి తో పాటు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

​ గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలి
కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ‌టి.స్కైలాబ్ బాబు డిమాండ్ ఖమ్మం నగరంలో మైనర్ బాలికపై లైంగికదాడి చేసి బిల్డింగ్ నుంచి తోసేసిన నిందితుడు గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఈమేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ నేరానికి పాల్పడిన అతనిపై ఫొక్సో కేసు నమోదు చేసిన పోలీసులే నిందితుడికి రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఈ కేసు విషయంలో చొరవ చూపి కేసును త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్‌ ‌చేశారు. బాలికకు నాణ్యమైన వైద్యం అందించి ప్రాణాలను రక్ష‍ించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -