నవతెలంగాణ – పరకాల
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం స్థానిక కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి నేతృత్వంలో వార్డు ప్రజలు గురువారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా వార్డులోని దామెర చెరువు మత్తడి కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల వర్షాకాలంలో నీరు నిలిచి, అపరిశుభ్రంగా మారుతుందని, దీనిని ముందుస్తుగా తొలగించి శుభ్రం చేయాలని కోరారు. అలాగే, వార్డులోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, తద్వారా స్థానికులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని విన్నవించారు. వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు సంఘ నరేష్, బుర్ర వెంకటేశ్వర్లు, మోతే సారంగపాణి, కుర్ర సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పరకాల తొమ్మిదో వార్డులో పారిశుద్ధ్య పనులకు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



