Saturday, August 15, 2026
E-PAPER
Homeజిల్లాలుతెలంగాణలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

తెలంగాణలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రానున్న మరికొన్ని గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వరంగల్‌, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వర్షం సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటలకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -