Saturday, June 13, 2026
E-PAPER
Homeబీజినెస్Amazon.inలో ఏడాది  రెండు రెట్లు పెరిగిన ద్విచక్ర వాహనాల విక్రయాలు

Amazon.inలో ఏడాది  రెండు రెట్లు పెరిగిన ద్విచక్ర వాహనాల విక్రయాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : Amazon.inలో తమ టూ-వీలర్ స్టోర్ ఏడాదిలో 2 రెట్లు వృద్ధిని సాధించిందని అమేజాన్ ఈరోజు ప్రకటించింది. టియర్ 2 మరియు టియర్ 3 పట్టణాల నుండి ఈ డిమాండ్ వచ్చింది. కస్టమర్లు రోజూ ఉపయోగించే కమ్యూటర్ బైక్స్ తో పాటు ప్రీమియం మరియు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కంపెనీ ప్రస్తుతం ట్రైంఫ్, KTM, రాయల్ ఎన్ ఫీల్డ్, బజాజ్ ఆటో, ఆథర్ ఎనర్జీ మరియు హీరో మోటోకార్ప్ సహా ఎలక్ట్రిక్, ప్రీమియం మరియు కమ్యూటర్ శ్రేణుల్లో 20 కంటే ఎక్కువ బ్రాండ్స్ నుండి ఎంపిక చేసిన జాబితాను కలిగి ఉంది, ఈ బ్రాండ్స్ అన్నింటికీ 3,000 కంటే ఎక్కువమంది అథీకృత డీలర్స్ మద్దతు లభిస్తోంది.

“భారతదేశంలో టూ-వీలర్ కొనుగోలు ప్రయాణం తరచుగా ఎక్కువగా ఉంటోంది మరియు ప్రాధాన్యత ఇవ్వడానికి  గందరగోళపరిచే ఐచ్ఛికాలతో , ఇంధనం రకాలు మరియు ధరల పాయింట్లతో  భారంగా తయారైంది. మీకు పరిమితమైన ఎంపిక ఉన్నప్పుడు  ముఖ్యంగా మెట్రోయోతర పట్టణాల్లో  ఇది మరింత  పరిమితిగా అనిపిస్తుంది. కస్టమర్ల కోసం, Amazon.in పూర్తి నిజాయితీ ధర మరియు డిజిటల్ చెల్లింపుల సౌకర్యంతో  బ్రాండ్స్, ధరల పాయింట్లు మరియు ఇంధనం రకాలతో అతి పెద్ద ఎంపికను ఒక చోట చేర్చింది. బ్రాండ్స్ కోసం, ఇది తమ చేరికను విస్తరించింది. గత రెండేళ్లకు పైగా, మేము  రెండిటినీ నెరవేర్చడానికి ఎంపిక, సాధనాలు మరియు చేరికను రూపొందించాము మరియు పూర్తి సంవత్సరం అంతటా విస్తరించడం కొనసాగిస్తాము, “అని అమన్ లోహన్, డైరెక్టర్, హోమ్, కిచెన్ మరియు అవుట్ డోర్స్, అమేజాన్ ఇండియా అన్నారు.

కస్టమర్లు ప్రీమియంను ఎంచుకుంటున్నారు
ఇంధనం రకాల్లో, కస్టమర్లు ప్రీమియం ఫీచర్లు, కనక్టెడ్ టెక్నాలజీ, ఆధునిక భద్రతా వ్యవస్థలు మరియు దీర్ఘకాలం యాజమాన్యం విలువతో మోడల్స్ ను ఎంచుకుంటున్నారు. Amazon.inలో కొనుగోలు చేసే సగటు టూ-వీలర్ ఇప్పుడు రూ. 1 లక్షను దాటింది, ఇది ఎక్కువ-వివరణలు గల మోడల్స్ ను ఎంచుకోవడానికి కలిగిన స్పష్టమైన మార్పును సూచిస్తోంది. ప్రీమియం మోటార్ సైకిళ్లు సంవత్సరం ప్రాతిపదికన సుమారు 5 రెట్లు కంటే ఎక్కువగా పెరిగాయి, కమ్యూటర్ బైక్స్ రెట్టింపు కంటే ఎక్కువగా వృద్ధి చెందగా, ఇదే సమయంలో ICE స్కూటర్లు 1.5 రెట్లు పెరిగాయి. ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ కోసం, ఇప్పుడు Amazon.inలో  మొత్తం EV డిమాండ్ లో సగానికి పైగా వాటా ఇప్పుడు రూ.1 లక్ష నుండి రూ.1.5 లక్షల శ్రేణికి చెందినది. ఇది ఎంట్రీ-స్థాయి ఎంపికల నుండి మిడ్-ప్రీమియం ఎలక్ట్రిక్ ప్రయాణం వైపు జరుగుతున్న మార్పును సూచిస్తుంది.
మెట్రోయేతర పట్టణాల నుండి డిమాండ్ వస్తోంది
Amazon.inలో రెండు చక్రాల వాహనాల డిమాండ్ ప్రధానంగా మెట్రో నగరాలకు వెలుపల నుంచే వస్తున్న కథ. ప్రతి 3 మంది కస్టమర్లలో దాదాపు 2 మంది టియర్ 2 మరియు టియర్ 3 నగరాల నుండి వస్తున్నారు; ఎలక్ట్రిక్ రెండు చక్రాల వాహనాల విషయంలో ఈ వాటా 10లో 7కి పెరుగుతుంది. ఈ నగరాల్లో వృద్ధి వేగంగా పెరుగుతోంది. దక్షిణ భారతదేశంలోని కాకినాడ, తిరుపతి మరియు నెల్లూరులో బుకింగ్స్ సంవత్సరానికి సంవత్సరం (YoY) 12 రెట్లు వరకు పెరిగి అత్యధిక వృద్ధిని చూపించాయి. ఉత్తర భారతదేశంలోని నాగౌర్ మరియు జింద్, అలాగే పశ్చిమ భారతదేశంలోని జామ్‌నగర్, బిలాస్‌పూర్ మరియు రాజ్‌కోట్ నుండి రెండు చక్రాల వాహనాల బుకింగ్స్ YoY 6 రెట్లు వరకు పెరిగాయి. తూర్పు భారతదేశంలోని పూర్ణియా మరియు సమస్తిపూర్ YoY 7 రెట్లు వరకు పెరిగి కొత్త డిమాండ్ కేంద్రాలుగా అవతరించాయి. వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది, వారు రెండు చక్రాల వాహనాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడాన్ని ఎంచుకుంటున్నారు. గత 12 నెలల్లో, 2,300కు పైగా టియర్ 3 పట్టణాల వినియోగదారులు Amazon.inలో మొదటిసారిగా రెండు చక్రాల వాహనాన్ని కొనుగోలు చేశారు.
కనుగొనడం నుండి  కొనుగోలు చేయడం వరకు నిరంతర ప్రయాణం
Amazon.inలో OEM అథీకృత డీలర్స్ ద్వారా బ్రాండ్స్ తో పాటు ఎలక్ట్రిక్ మరియు కమ్యూటర్ విభాగాలకు చెందిన ప్రీమియం మోటార్ సైకిళ్ల విస్తృత ఎంపికను ఆన్ లైన్ లో ఒకే చోటకు తీసుకువచ్చింది. Amazon.inలో ప్రతి డీలర్ OEM అధికారిక డీలర్, వీరు అసలు తయారీదారు వారంటీ ద్వారా మద్దతు చేయబడిన వాస్తవిక ఉత్పత్తులను కస్టమర్లు అందుకునేలా నిర్థారిస్తారు. కస్టమర్లు 24×7 కొనుగోళ్లు చేయవచ్చు, బ్రాండ్స్ మరియు ఇంధనం రకాలు పోల్చవచ్చు, ధృవీకరించబడిన యజమాని సమీక్షలు మరియు రేటింగ్స్ పొందవచ్చు మరియు OEM అథీకృత డీలర్ ను సందర్శించకుండా తమ ఖచ్చితమైన పిన్ కోడ్ కోసం ఎక్స్-షోరూం ధరలను చూడవచ్చు.  క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో జీరో MDR ఛార్జీలతో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI మరియు నెట్ బ్యాంకింగ్ లో చెల్లింపులు పూర్తిగా డిజిటలీకరణ చేయబడ్డాయి మరియు ప్రతి ఆర్డర్ లో మోసపోకుండా పూర్తి రక్షణ లభిస్తుంది.
క్లిష్టమైన నిర్ణయాన్ని సులభతరం చేసిన AI సాధనాలు
భారతదేశంలో ఎక్కువమంది కస్టమర్లు మొదటిసారి టూ-వీలర్స్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తున్న కారణంగా, Amazon.in వారి AI-ఆధారిత సాధనాలు అత్యంత జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవలసిన నిర్ణయాలలో వినియోగదారులకు సహాయపడతాయి. అమేజాన్ వారి AI షాపింగ్ అసిస్టెంట్ రూఫస్, బ్రాండ్స్ మరియు ఇంధనం రకాల్లో రేంజ్, మైలేజీ, ఫీచర్లు మరియు అనుకూలతల్లో వివరణాత్మకమైన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ద్వారా   కస్టమర్లు సంక్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. చిత్రంతో సెర్చ్ చేయడానికి LensAI కస్టమర్లకు అవకాశం ఇస్తుంది, రోడ్డుపై వారు గుర్తించిన మోడల్స్ ను గుర్తించి మరియు అన్వేషించడంలో సహాయపడుతుంది. రివ్యూ సమ్మరీస్ వేలాది కస్టమర్ల సమీక్షలను క్లుప్తంగా, సులభంగా చదవగలిగే స్నాప్ షాట్స్ గా అందిస్తుంది మరియు యజమానులు ఒక మోడల్ గురించి వాస్తవంగా ఏమని భావిస్తున్నారు కస్టమర్లు వేగంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రైస్ హిస్టరీ అనేది ఒక ఉత్పత్తి యొక్క ధర కాలక్రమేణా ఏ విధంగా మారింది కస్టమర్లు పూర్తిగా చూడటానికి అవకాశం ఇస్తుంది, ఎప్పుడు కొనుగోలు చేయాలో వారు నిర్ణయించడంలో సహాయపడుతుంది. మొత్తంగా, ఈ సాధనాలు పరిశోధనా చక్రాన్ని తగ్గిస్తాయి మరియు భారతదేశంవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు గొప్ప ఆత్మవిశ్వాసంతో ఎంచుకోవడానికి సహాయపడతాయి.
అమేజాన్ పేతో మీ ఆదాలు అత్యధికం చేయండి
రూ. 2,500 వరకు విలువ గల వెల్కం రివార్డ్స్ తో పాటు అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై నాన్-ప్రైమ్ సభ్యులు 3% మరియు ప్రైమ్ సభ్యులు అపరిమితంగా 5% క్యాష్ బాక్ సహా విస్తృత శ్రేణి చెల్లింపులు మరియు రివార్డ్ ప్రయోజనాలు ద్వారా అమేజాన్ పేతో కస్టమర్లు తెలివిగా కొనుగోళ్లు చేయవచ్చు, ఎక్కువ ఆదా చేయవచ్చు. అమేజాన్ పే లేటర్ ద్వారా రూ. 60,000 వరకు తక్షణ క్రెడిట్ ను అర్హులైన కస్టమర్లు పొందవచ్చు మరియు ప్రత్యేకమైన షాపింగ్ రివార్డ్స్ ను ఆనందించవచ్చు, మరియు మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ మరియు ఉపకరణాలలో రూ.99/రోజు EMI స్టోర్ ద్వారా అనుకూలమైన ధరలకు కొనుగోళ్లు చేయవచ్చు. మూడు నెలల్లో చెల్లింపులు పూర్తి చేయడం ద్వారా రివార్డ్స్ గోల్డ్ తో, కస్టమర్లు 15+ బ్రాండ్స్ మరియు శ్రేణుల్లో తప్పనిసరిగా 5% క్యాష్ బాక్ ను సంపాదించవచ్చు  ప్లస్ అదనంగా క్యాష్ బాక్ మరియు  రివార్డ్స్ గోల్డ్ ప్రయోజనాలు పొందవచ్చు- దీనిలో రూ. 799 కంటే ఎక్కువ విలువ గల ఆర్డర్లపై ప్రైమ్ సభ్యుల కోసం 5% తగ్గింపు మరియు రూ. 499 కంటే ఎక్కువ ఆర్డర్లపై కస్టమర్లు అందరికీ 10% క్యాష్ బాక్ లభిస్తుంది మరియు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కస్టమర్లకు ఇది కొనుగోళ్లను మరింత ప్రయోజనకరం చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -