నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు ఇటీవల బదిలీపై వచ్చి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ సతీష్ ను స్థానిక సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, టిఆర్ఎస్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సతీష్ ను కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఎస్ఐకి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ హామీని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మల్యాల సుభాష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, టిఆర్ఎస్ రైతు విభాగం మండల అధ్యక్షులు బద్దం రాజశేఖర్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొంటి కంటి నరేందర్, నాయకులు బద్దం రాజేష్, రేంజర్ల మహేందర్, నాగేష్, సురేష్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
నూతన ఎస్ఐ ని కలిసిన బీఆర్ఎస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


