భారత్, పాక్ మహిళల ఢీ నేడు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్
బర్మింగ్‌హామ్ (ఇంగ్లాండ్) : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్ వేటను టీమ్ ఇండియా విజయంతో మొదలెట్టేందుకు సిద్ధమవుతోంది. పొట్టి ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్ నేడు పొరుగు దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది. వన్డే వరల్డ్‌కప్ విజేతగా భారత జట్టు డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణంలో గుణాత్మక మార్పు కనిపిస్తోంది. షెఫాలీ వర్మ 22 ఏండ్ల వయసులో ఏకంగా నాల్గో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగుతోంది. స్మృతీ మంధాన తోడుగా షెఫాలీ వర్మ విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడటంపైనే దృష్టి నిలిపింది. జెమీమా రొడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ మెరిస్తే భారత్‌కు తిరుగుండదు. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి తుది జట్టులో చోటు కోసం రేణుకా సింగ్‌తో పోటీపడుతోంది. శ్రీ చరణి, క్రాంతి గౌడ, నందని శర్మలతో బౌలింగ్ లైనప్ బలోపేతంగా కనిపిస్తోంది. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు మాత్రమే సెమీస్‌కు చేరనున్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ ప్రతిష్టాత్మకమే. ఫాతిమా సనా సారథ్యంలోని పాకిస్తాన్ నేడు భారత్ ముందు నిలబడేనా? చూడాలి. బారత్, పాకిస్తాన్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం.
దాయాదుల ధనాధన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



