Monday, February 16, 2026
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ ఫలితాలు
‘భూపతి చంద్ర’ మెమోరియల్‌ ట్రస్ట్‌ నిర్వహించిన భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ ఫలితాలు : ప్రథమ బహుమతి (శ్రీ సుంకోజి దేవేంద్రాచారి) ‘అంతర్ధానం’, ద్వితీయ బహుమతి (శ్రీ పొత్తూరి సీతారామరాజు) ‘పులి నెత్తుటి ముగ్గు’, తృతీయ బహుమతి (శ్రీ పుప్పాల కష్ణమూర్తి) ‘కన్నీట వసంతం’, ప్రోత్సాహక బహుమతులు: డా|| ఎం. సుగుణ రావు – ‘ఒక కొడుకు తీర్పు’, శ్రీ చొక్క తాతారావు – ‘ఇచ్చోటనే కద’, శ్రీ మొయిద శ్రీనివాసరావు- ‘అంబటి తట్ట’, శ్రీమతి ఉయ్యూరు అనసూయ – ‘రెండో కోణం’, శ్రీ మధుసూదన రావు – ‘కర్టెన్‌’; కథానికలు బహుమతులను గెలుచుకున్నాయి. బహుమతుల ప్రదానోత్సవ సభ ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు డా.దేవులపల్లి రామానుజరావు కళా మందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్‌ రోడ్‌, హైదరాబాదులో నిర్వహిస్తారు.
వివరాలకు : 99636 16999.
– ఎమ్‌.ఎల్‌. కాంతారావు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -