– బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతున్నదని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌కు ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీకి 30 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని తెలిపారు. రేవంత్ రెడ్డి కీలక శాఖలను తన వద్ద ఉంచుకుని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి వద్ద ఉండటంతో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలను వారం రోజుల్లోనే ముగించారని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఎవరు ఉల్లఘించినా ఎన్నికల కమీషన్ నోటీసులివ్వాలన్నారు. వికారాబాద్ సభలో సీఎం హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పినా రేవంత్ రెడ్డికి ఎన్నికల కమీషన్ ఎందుకు నోటీసులివ్వలేదని ప్రశ్నించారు. మిర్యాలగూడలో సీపీఐ(ఎం) కార్యకర్తను కాంగ్రెస్ వాళ్లు చంపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. రాత్రికి రాత్రే ఎక్స్ అఫిషియో ఓట్లు యాడ్ చేసుకుంటున్నారనీ, విప్ జారీ చేస్తే పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు. చైర్మెన్, మేయర్ ఎన్నికలను పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో బీఆర్‌ఎస్ నేత పల్లె రవికుమార్ ,కవి ,గాయకుడు సందీప్ పాల్గొన్నారు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



