Wednesday, June 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కంటాలిలో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు పంపిణీ

కంటాలిలో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
రాష్ట్రవ్యాప్తంగా నేటినుంచి పఠశాలలు పున: ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలంలోని కంటాలి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలను సోమవారం గ్రామస్తులు, పెద్దల చేతులను మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు గొల్ల లక్ష్మీ మాట్లాడుతూ.. మండల విద్యాధికారి ఆదేశాలను మేరకు జిల్లా విద్యాశాఖ ద్వారా పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కులు పాఠశాలకు సకాలంలో అందాయని తెలిపారు. ఈ క్రమంలో గ్రామపెద్దలను ఆహ్వానించి వారి చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించేందుకు ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -