Monday, June 15, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మద్యపానాన్ని నిషేదించాలని గ్రామస్థుల రాస్తారోకో

మద్యపానాన్ని నిషేదించాలని గ్రామస్థుల రాస్తారోకో

- Advertisement -

నవతెలంగాణ-సిర్పూర్(టి )
గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించి, అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వేంపల్లి గ్రామస్థులు సోమవారం సిర్పూర్–కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్యపానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామస్థులు మాట్లాడుతూ గతంలో గ్రామసభ నిర్వహించి మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ గ్రామంలో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం కారణంగా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మద్యపానం వల్ల మహిళలు, పిల్లల జీవితాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

రోడ్డుపై చేపట్టిన నిరసనతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులతో చర్చించారు. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రామంలోని బెల్ట్‌షాపులపై సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుబడిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యపాన నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుని గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని గ్రామస్థులు అధికారులను డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -