Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానవత్వం చాటుకున్న ఎన్నారై శ్రీనివాస్ రెడ్డి 

మానవత్వం చాటుకున్న ఎన్నారై శ్రీనివాస్ రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని ఇందూర్తి గ్రామానికి చెందిన ఎన్నారై కుంభం శ్రీనివాస్ రెడ్డి మరొకసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అదే గ్రామానికి చెందిన ఏరుకొండ లింగయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు లింగయ్యకు ఇద్దరు చిన్న పిల్లలు.కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి పిల్లల చదువులకు స్కూల్ ఫీజులు‌ కూడా కట్టడం ఆ కుటుంబానికి ఇబ్బందిగా మారింది. సోమవారం గ్రామస్తులు ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన ఎన్నారై కుంభం శ్రీనివాస్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు.

అందుకు ఆయన సానుకూలంగా స్పందించి లింగయ్య ఇద్దరు పిల్లల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నారై కుంభం శ్రీనివాస్ రెడ్డి చేసిన సహాయానికి గ్రామస్తులతో పాటు,మృతిని కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరుకొండ లింగస్వామి,సిలివేరు రమేష్,జంగయ్య,ఏరుకొండ నరేష్,ఏరుకొండ రాము,బొల్లోజు శoకరచారి,రామాచారి,బ్రాహ్మచారి,ఏరుకొండ రామచంద్రo,లచ్చయ్య,తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -