Monday, February 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరేపు జెనీవాలో ఇరాన్‌-అమెరికాల మధ్య అణు చర్చలు

రేపు జెనీవాలో ఇరాన్‌-అమెరికాల మధ్య అణు చర్చలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఒమన్‌ మధ్యవర్తిత్వంలో జెనీవాలో ఫిబ్రవరి 17 ఇరాన్‌- అమెరికాల మధ్య రెండో రౌండ్‌ అణు చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జెనీవా చర్చలకు ముందు అమెరికా, ఇజ్రాయిల్‌ ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి. చైనాకు చమురు ఎగుమతులు తగ్గించాలని ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా కృషి చేస్తున్నారని వచ్చిన ఆక్సియోస్‌ నివేదికను బీజింగ్‌ తీవ్రంగా విమర్శించింది. ఇరాన్‌తో కదుర్చుకున్న తన చట్టబద్ధమైన ఆర్థిక సహకారానికి అమెరికా, ఇజ్రాయిల్‌ గౌరవించాలని చైనా కోరింది. అంతర్జాతీయ చట్టం పరిధిలో దేశాల మధ్య జరిగే సహకారం సహేతుకమైనది. చట్టబద్ధమైనది. దానిని గౌరవించి రక్షించాలి అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా ప్రకటన పేర్కొంది.
కాగా, బుధవారం జరిగే వాణిజ్య చర్చల్లో చైనాకు చమురు ఎగుమతులు తగ్గించాలని ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తోందని చైనా ఆరోపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -