పూణే ప్రత్యేక అధికారులతో పర్యవేక్షణ..
సిద్దిపేట రూరల్ సీఐ శీను
నవతెలంగాణ – చిన్నకోడూరు
మండల పరిధిలోని చౌదారం, గుండారం గుట్టల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని రూరల్ సీఐ శీను తెలిపారు. సోమవారం చౌడారం, బెజ్జంకి మండలం గుండారం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న అనుమానంతో ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రాత్రి వేళల్లో బావుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు.
అటవీ శాఖ అధికారులు,పూణే నుండి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ టీమ్ సభ్యులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. పులి కదలికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా చౌడారం, గుండారం వైపు అటవీ ప్రాంతంలోకి వెళ్లే రెండు ప్రధాన మార్గాలను మూసివేసొమన్నారు. సామాన్య ప్రజలు, గొర్రెల కాపరులు అడవిలోకి వెళ్లకూడదని తెలిపారు. చౌడారం అడవిలో శుక్రవారం రోజున ఒక దూడను చెట్టుకు కట్టేసిన ప్రాంతంలో పులి సంచరించినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం రెస్క్యూ టీమ్ పులిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిపారు.
ప్రజలు ఒంటరిగా అటవీ ప్రాంతాలకు, పొలాలకు వెళ్లవద్దని సూచించారు. చౌడారం, విఠలాపూర్, గంగాపూర్, మాచాపూర్, కిష్టాపూర్, మల్లారం, అనంతసాగర్, రంగాయపల్లి, ఎల్లాయిపల్లి, కమ్మర్లపల్లి, మైలారం, అల్లిపూర్ బెజ్జంకి మండలం గుండారం గ్రామాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యంత అవసరమైతేనే ప్రజలు రాత్రి వేళల్లో ఇంటి నుండి బయటకు వెళ్లాలన్నారు. చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ పూణే నుండి వచ్చిన అటవీ శాఖ ప్రత్యేక అధికారులు ఉన్నారు.



