Tuesday, June 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఫ్రాన్స్‌లో జీ-7 స‌ద‌స్సు.. పీఎం మోడీ హాజ‌రు

ఫ్రాన్స్‌లో జీ-7 స‌ద‌స్సు.. పీఎం మోడీ హాజ‌రు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఫ్రాన్స్ వేదిక‌గా 52వ శిఖరాగ్ర జీ7 స‌ద‌స్సు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు పీఎం మోడీ స‌దురు స‌ద‌స్సుకు హాజ‌రైయ్యారు. ఆ త‌ర్వాత‌ ఎవియాన్-లెస్-బైన్స్ సరస్సు తీర ప్రాంతంలో పలువురు ప్రపంచ నాయకులతో కలిసి ప్ర‌ధాని మోడీ ఫొటోలు దిగారు. ప్రధాని మోడీతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, జపాన్ ప్రధానమంత్రి సనాయే టకైచి, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా వంటి కీలక ప్రపంచ నాయకులు ఉన్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం 13వ సారి ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనగా, ప్రధానమంత్రి వరుసగా ఏడో ఈ ప్రపంచ వేదికపై పాల్గొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -