Wednesday, June 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు40లక్షల ఓట్లకు సర్ గండం

40లక్షల ఓట్లకు సర్ గండం

- Advertisement -

రాష్ట్రంలో 69.92 శాతం మ్యాపింగ్ పూర్తి
‘సర్’ పూర్తయిన 10 రాష్ర్టాలు,
3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో
9.6 శాతం కోత
తెలంగాణలో 10 నుంచి
12 శాతం తగ్గే అవకాశం

అత్యధికంగా మహబూబాబాద్ లో 94.47 శాతం అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరిలో 43.3 శాతం

ఊరగొండ మల్లేశం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) దెబ్బకు రాష్ట్రంలో దాదాపు 40 లక్షల ఓట్లకు గండి పడే అవకాశం ఉంది. జూన్ 14 వరకు 2002 సర్ ఓటర్ జాబితా మ్యాపింగ్ సగటున 69.92 శాతం మాత్రమే జరిగింది. అత్యధికంగా మహబూబాబాద్ లో 94.47, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరిలో 43.3 శాతం పూర్తయింది. మొదటి, రెండో విడత సర్ ప్రక్రియ జరిగిన 10 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సగటున 9.6 శాతం ఓట్లకు కోత పడింది. అత్యధికంగా యూపీలో 13.27 శాతం, గుజరాత్ లో 13.4 శాతం ఓట్లు తగ్గాయి. జాతీయ సగటుతో పోల్చినా, రాష్ట్రంలో మ్యాపింగ్ కాని శాతంతో పోల్చినా 10 నుంచి 12 శాతం ఓట్లు తగ్గుతాయని భావిస్తున్నారు. ​మూడో దశలో తెలంగాణతో సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ఇంటింటి గణన నుంచి మొదలై అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితా ప్రచురణతో ముగియనుంది. తెలంగాణలో మొత్తం 3,38,29.118 మంది ఓటర్లలో 2,36,54,232 మంది మ్యాపింగ్ జరిగింది. ఇంకా 1,01.74,786 మంది ఓటర్ల మ్యాపింగ్ మిగిలి ఉంది. ఈ నెల 25 నుంచి ఇంటింటి గణన ప్రారంభం కానున్న నేపథ్యంలో 14 నుంచి ముందస్తు మ్యాపింగ్ ప్రక్రియను ఎన్నికల సంఘం నిలిపి వేసింది. జిల్లాల వారీగా చూసినట్టుయితే అత్యధికంగా మహబూబాబాద్ లో 94.47, అత్యల్పంగా గ్రేటర్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 43.3, హైదరాబాద్ లో 46.15, రంగారెడ్డిలో 57.78 శాతం పూర్తయింది.

ఇంటింటి గణనలో మ్యాపింగ్ కాని 30.8 శాతం మంది ఎన్నికల సంఘం నిర్దేశించిన అధారాలు సమర్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌ ‌కార్డులు, జన్మ ధృవీకరణ పత్రం, పాస్‌ ‌పోర్ట్‌, టెన్త్‌ సర్టిఫికెట్‌, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, భూమి/ఇంటి కేటాయింపు మొదలగు 12 డ్యాక్యుమెంట్లను ఎన్నికల సంఘం అనుమతిం చింది. మ్యాపింగ్ పూర్తి కాని వారిలో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు బతుకు దెరువు కోసం వలస వచ్చిన వారే ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు మూకుమ్మడిగా వీరి ఓట్లను నమోదు చేయించారు. హస్టళ్లు, వ్యాపార సముదాయాలు లాంటి వాటిల్లో గంప గుత్తన ఓట్లు నమోదైన సందర్భాలున్నాయి.ఇందుకు సంబంధించి గతంలో ఈసీకి అనేక ఫిర్యాదులు అందాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన మ్యాపింగ్ తో పోల్చి చూస్తే గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో అత్యధికంగా ఓట్లు తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా తగ్గే ఓట్లల్లో దాదాపు 60 శాతం ఇక్కడి నుంచే ఉంటాయని తెలుస్తోంది. మ్యాపింగ్ కాని వారిలో ఎన్నికల సంఘం (ఈసీ) పేర్కొన్న గుర్తింపు కార్డులు లేని వారు గ్రేటర్‌ హైదరాబాద్‌ ‌తర్వాత కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉన్నారు.

సర్‌ ‌రెండు విడతల్లో 5.14 కోట్ల ఓట్లకు కోత
సర్‌ మొదటి, రెండు విడతల్లో 58.43 కోట్ల ఓట్లకు గాను 5.14 కోట్ల ఓట్లు తగ్గాయి. ఇందులో బీహార్ లో సర్ కు ముందు 2025 జూన్ 24 నాటికి ఓటర్ల సంఖ్య 7,89,69,844 మంది కాగా ‘సర్’ ప్రక్రియ పూర్తయ్యాక 2025 సెప్టెంబర్ 30 నాటికి 7.42 కోట్ల మంది తుది జాబితాలో స్థానం పొందారు. మొత్తంగా 47 లక్షల ఓట్లు తగ్గాయి. పశ్చిమ బెంగాల్లో ‘సర్’ కు ముందు 7,66,37,529 మంది మొత్తం ఓటర్లు ఉండగా, ‘సర్’ పూర్తయ్యాక 7,04,59,284 ఓటర్లు తుది జాబితాలో నమోదయ్యారు. 61.8లక్షల ఓట్లు తగ్గాయి. ఉత్తర్ ప్రదేశ్ లో సర్ కు ముందు 15.44 కోట్ల ఓట్లు ఉండగా, సర్ పూర్తయ్యాక 13.39 కోట్ల మంది తుది జాబితాలో ఓటర్లుగా నమోదయ్యారు. 2.05 కోట్ల ఓట్లు తగ్గాయి. రాజస్థాన్‌‌లో మాత్రం ‘సర్‌’ ‌తర్వాత 10.5 లక్ష‍ల ఓట్లు పెరిగాయి.


కేంద్ర పాలిత ప్రాంతాలు
—————————–
1) అండమాన్ నికోబార్ 3.20 లక్షలు 3 లక్షలు 20 వేలు
2). పాండిచ్చేరి 10.21 లక్షలు 9.44 లక్షలు 77 వేలు
3)లక్ష్యదీప్ 58,0000 57,607 393 ఓట్లు
————— ————– —————-
మొత్తం 58.43 కోట్లు 53.14 కోట్లు 5.14 కోట్లు
—————— —————— —————-

రాష్ట్రం సర్ కు ముందు సర్ తర్వాత తగ్గిన ఓట్లు
1) బీహార్ 7.89 కోట్లు 7.42 కోట్లు 47 లక్షలు
2).పశ్చిమ బెంగాల్ 7.66 కోట్లు 7.04 కోట్లు 61.8 లక్షలు
3). ఉత్తరప్రదేశ్ 15.44 కోట్లు 13.39 కోట్లు 2.05 కోట్లు
4). ఛత్తీస్ గడ్ 2.12 కోట్లు 1.87 కోట్లు 25 లక్ష లు
5) గోవా 11.85 లక్షలు 10.57 లక్షలు 1.27 లక్షలు
6). గుజరాత్ 5.08 కోట్లు 4.40 కోట్లు 68.1 లక్షలు
7). కేరళ 2.78 కోట్లు 2.69 కోట్లు 8.97 లక్షలు
8). తమిళనాడు 6.40 కోట్లు 5.67 కోట్లు 74 లక్షలు
9). మధ్యప్రదేశ్ 5.74 కోట్లు 5.39 కోట్లు 34.25 లక్షలు
10). రాజస్థాన్ 5.05 కోట్లు 5.15 కోట్లు 10.5 లక్షలు (పెరిగాయి)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -