Wednesday, June 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజర్నలిస్టుల ఇండ్లస్థలాలపై 
క్యాబినెట్‌ సబ్‌‌కమిటీ త్వరగా నివేదికనివ్వాలి

జర్నలిస్టుల ఇండ్లస్థలాలపై 
క్యాబినెట్‌ సబ్‌‌కమిటీ త్వరగా నివేదికనివ్వాలి

- Advertisement -

జర్నలిస్టుల పిల్లల చదువుల కోసం ఫీజు రాయితీ కల్పించాలి :
డిప్యూటీ సీఎం భట్టికి టీడబ్ల్యూజేఎఫ్‌ వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారిధిగా ఉంటూ విస్తృతంగా ప్రజా సేవ చేస్తున్న నేపథ్యంలో వేగంగా ఇండ్లస్థలాలు కేటాయించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, క్యాబినెట్‌ ‌సబ్‌‌కమిటీ చైర్మెన్‌ మల్లు భట్టి విక్రమార్క ను కోరారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని ప్రజాభవన్‌‌లో డిప్యూటీ సీఎంకు తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్ట్స్‌ ‌ఫెడరేషన్‌(‌టీడబ్ల్యూజేఎఫ్‌) ‌నాయకత్వం వినతిపత్రం సమర్పించింది. ఈసందర్భంగా జర్నలిస్టుల పరిస్థితులను ఫెడరేషన్‌ ‌రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్ష‍ులు ఎల్లోయి ప్రభాకర్‌, జి మాణిక్‌‌ప్రభు, కార్యదర్శి బి.జగదీశ్వర్‌, రాష్ర్ట నాయకులు పి. విజయ, షేరిభాయి గణేష్‌, బి. సైదులు, లలిత మంత్రికి వివరించారు. జర్నలిస్టులు సరైన వేతనాలు లేకుండా జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పెట్టుబడులతో మీడియా రంగంలో ఉద్యోగ భద్రత కొరవడిందని చెప్పారు. ఆర్ధిక పరిస్థితులు సవ్యంగా లేక మీడియా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాలో అనేక మార్పులు వస్తున్నాయని చెప్పారు. కనీస అవసరాలకు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని వివరించారు. గత 40 ఏండ్లకు పైగా జర్నలిస్టులకు హైదరాబాద్‌‌లో ఇండ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. దీంతో ఇంటి అద్దెల భారం విపరీతంగా పడుతున్నదని వివరించారు.

హైదరాబాద్ నగరంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చాలీచాలని వేతనాలతో జర్నలిస్టులు, వారి కుటుంబాల జీవనం అగమ్యగొచరంగా మారుతున్నదన్నారు. స్థిర నివాసం లేక అష్ట కష్టాలు పడుతున్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమటీ నివేదికను త్వరిగతన సమర్పిం చాలని సూచించారు.అయితే ఈ ప్రక్రియను ఎలాంటి న్యాయ సంబంధమైనా వివాదాలు లేకుండా చెపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇండ్ల స్థలాల మంజూరీ కోసం జర్నలిస్టులు వేయి కండ్లతో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. అలాగే గతంలో మాదిరిగా జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. కాంట్రి బ్యూషన్ను జర్నలిస్టుల తరపున ప్రభుత్వమే చెల్లించా లని,తద్వారా కార్పొరేట్ ఆసుపత్రు ల్లో వైద్యం అందించాలని వివరించారు. జర్నలిస్టులకు ఇచ్చే అక్రెడిటేషన్ల ప్రక్రియను వేగంగా ముగిం చాలని కోరారు. జర్నలిస్టుల అందరికి న్యాయం చేయాలని సూచించారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు, కార్పొరేట్‌ ‌పాఠశాలల్లో 50 శాతం రాయితీ కల్పించా లని విజ్ఞప్తి చేశారు.పెరుగుతున్న ధరలు, ఆకాశాన్నం టిన స్కూల్‌ ‌ఫీజుల నేపథ్యంలో ఈ విషయమై దృష్టిసారించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -