Wednesday, June 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫెర్టిలైజర్ దుకాణాల్లో ఏఓ ఆకస్మిక తనిఖీలు

ఫెర్టిలైజర్ దుకాణాల్లో ఏఓ ఆకస్మిక తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి రెండు రోజులుగా ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ..పెస్టిసైడ్ రిజిస్టర్, పీసీ లు లేనందున అక్షయ, దత్తాత్రేయ షాపులకు తాత్కాలిక లైసెన్స్ రద్దు చేశామని తెలిపారు. అదేవిధంగా గణేష్ ఆగ్రో ఏజెన్సీ, ఖండేబల్లూర్ లో రెండు పెస్టిసైడ్, ఫర్టిలైజర్ దుకాణాల తాత్కాలిక లైసెన్స్ రద్దు చేశామని వెల్లడించారు. ప్రతి ఫర్టీలైజర్ దుకాణాల్లో ప్రభుత్వం కేటాయించిన గరిష్ట ధర కంటే ఎక్కువకు అమ్మితే వారి లైసెన్స్ పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఫర్టిలైజర్ దుకాణ దారులు రైతులకు విధిగా మ్యాన్యువల్ బిల్లులు కచ్చితంగా ఇవ్వాలని తెలిపారు. లేనియెడల కఠిన చర్యలు తప్పవని చెప్పారు. ఎరువులు దుకాణం యజమానులు తప్పనిసరిగా ధరల పట్టికను కనిపించే విధంగా డిస్ప్లే చేయాలని అన్నారు. కర్ణాటక , మహారాష్ట్రలో ప్రాంతాల నుండి దిగుమతి చేసుకున్న విత్తనాలు ఎరువులు, రసాయన మందులు అమ్మకాలు నిర్వహించవద్దని, తనిఖీలలో రాష్ట్రాల నుండి తెచ్చిన మందులు బయటపడితే చట్టరీత్యా చర్యలు, కేసులు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏడిఎ బిచ్కుంద అమర్ ప్రసాద్, ఏవో జుక్కల్ మహేశ్వరి, మద్నూర్ మండలం ఏవో రాజు, పెద్ద కొడప్ గల్ ఏవో కిషన్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -