Wednesday, June 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్ద ఏక్లారాలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్

పెద్ద ఏక్లారాలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలను సర్పంచ్ మహేష్ కుమార్ విద్యార్థులకు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వము విద్యాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యా భోదన చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -