Wednesday, June 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యా: సర్పంచ్

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యా: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధన అందుతుందని, ప్రజలు తమ తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని మేనూరు గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ అన్నారు. బుధవారం ఆయన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఉచితంగా అందించి పిల్లల చదువులకు ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ కార్యదర్శి హరీష్ కుమార్, గ్రామ పెద్దలు, జూబ్లీ సురేష్, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -