Wednesday, June 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలతో నిరుపేద కుటుంబాల్లో ఆనందం

ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలతో నిరుపేద కుటుంబాల్లో ఆనందం

- Advertisement -

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం: మండల పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు
నవతెలంగాణ-మద్నూర

గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలతో నిరుపేద కుటుంబాల్లో ఆనందాలు వ్యక్తం అవుతున్నాయని, పేదల సంక్షేమమే ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. జుక్కుల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు మద్నూర్ మండలంలోని హెచ్ కెలూరులో ఇందిరమ్మ ఇండ్లను గ్రామ సర్పంచ్ గడ్డం లక్ష్మణ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే పేదల సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్మని ప్రజా పాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి హాయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కృషి గ్రామ గ్రామాన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో గ్రామ సర్పంచ్ ,మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్, అదేవిధంగా మద్నూర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బండి గోపి, వార్డు సభ్యులు గంగాధర్, కాంగ్రెస్ నాయకులు కర్ల సాయిలు, హెచ్ కేలూరు గ్రామ నాయకులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -