Thursday, June 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసీతే..లంకాదహనం చేస్తే?

సీతే..లంకాదహనం చేస్తే?

- Advertisement -

అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ ధారిగా.. శర్వారి కీలక పాత్రలో య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న భారీ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. జూలై 3న సినిమా రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో బుధ‌వారం మేక‌ర్స్ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇద్ద‌రు అంద‌మైన హీరోయిన్స్ డెడ్లీ రోల్స్‌లో క‌నిపించ‌నున్నారు. స‌ర దాగా, థ్రిల్లింగ్‌గా రూపొందిన ఈ భారీ పాప్ కార్న్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుం టోంది. ఆలియా భట్‌ను శ‌క్తివం తురాలిగా త‌యారు చేసే మెంటర్‌గా బాబీ డియోల్ క్రూర‌మైన పాత్ర‌లో క‌నిపిం చారు. హంత‌కురాలి పాత్ర‌లో ఆలియా భ‌ట్ న‌టించింది. అయితే ఆమె కొన్ని ప‌రిస్థితుల్లో తనకు శిక్ష‌ణ ఇచ్చిన మెంట‌ర్‌కే శ‌త్రువుగా మారి వ్య‌తిరేకంగా పోరాడుతుంది. బాబీ డియోల్‌, ఆలియా భ‌ట్‌ల‌కు ఆల్ఫా ప్రోగ్రా మ్‌తో ఉన్న సంబంధం ఏంట‌నేది తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ఇందులో అనీల్ క‌పూర్ మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించారు. హై యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో పాటు సూప‌ర్ ఫ‌న్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆల్ఫా మూవీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌ టైన‌ర్‌గా అలరించనుంది. అలాగే ఆలియాతో పాటు శ‌ర్వారి కూడా ధైర్యంతో పోరాడే త‌త్వ‌మున్న వ్య‌క్తులుగా ట్రైల‌ర్ ఆవిష్క‌రించింది. ఆలియా భ‌ట్‌కు అండ‌గా నిలిచే పాత్ర‌లో శ‌ర్వారి న‌టించిన‌ట్లు ట్రైల‌ర్‌లో తెలుస్తోంది. కూల్ విజువల్స్తోపాటు ‘సీతే లంకా దహనం చేస్తే..` వంటి డైలాగ్స్ సినిమాలోని కంటెంట్‌ను మ‌రింత ఎలివేట్ చేసింది అని ట్రైలర్ చెప్పకనే చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -