టెహ్రాన్ : హార్ముజ్ జలసంధి తమదేనని, దాని నిర్వహణ బాధ్యత కూడా తమదేనని ఇరాన్ తొలి ఉపాధ్యక్షుడు మహమ్మద్ రెజా ఆరెఫ్ స్పష్టం చేశారు. హార్ముజ్ వ్యూహాత్మక ప్రాధాన్యతను ఆయన నొక్కి చెబుతూ జలసంధిని ఉపయోగించుకుంటున్న నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఇరాన్ అందజేస్తున్న సేవలకు అయ్యే వ్యయాన్ని భరించాల్సి ఉంటుందని చెప్పారు. అధికారులతో జరిపిన సమావేశంలో ఆరెఫ్ ప్రసంగిస్తూ హార్ముజ్‌లో నౌకాయాన భద్రత కోసం ఇరాన్ నిర్వహిస్తున్న పాత్రను కొనియాడారు. ఇరాన్ అందజేస్తున్న కీలక సేవల కారణంగానే వాణిజ్య నౌకలు సురక్షితంగా హార్ముజ్‌లో రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు. ఇరాన్ భద్రతా చర్యలు చేపట్టకపోతే నౌకలు తీవ్రమైన ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని, మందుపాతరలు పొంచి ఉంటాయని, పర్యావరణ సంబంధమైన అడ్డంకులు కూడా ఉంటాయని ఆరెఫ్ హెచ్చరించారు.
హార్ముజ్ ఇరాన్‌దే : తొలి ఉపాధ్యక్షుడు ఆరెఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



