నవతెలంగాణ-హైదరాబాద్: రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. మూడు వారాలపాటు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఐదెకరాల భూమి వ్యవహారం మళ్లీ హైకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా రాయదుర్గం పాన్మక్త పరిధిలోని సర్వే నంబర్ 83/1లో గల ఈ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఈ-వేలం ద్వారా విక్రయించడాన్ని సవాలు చేస్తూ ఎస్బీఐ 2 రిట్ పిటిషన్లు దాఖలు చేసింది. కోర్టు ఆదేశాలు అమలులో ఉండగా వేలం వేయడం చట్టవిరుద్ధమని ఎస్బీఐ తరఫు సీనియర్ న్యాయవాది బి.ఎస్. ప్రసాద్ వాదించారు. ఇటీవల వేలంలో ఎకరానికి రూ.170 కోట్లకు పైగా ధర పలికిందని, గౌరా వెంచర్స్ అత్యధిక బిడ్డర్‌గా నిలిచిందని కోర్టుకు తెలిపారు. జస్టిస్ శ్రవణ్‌కుమార్ గురువారం ఈ పిటిషన్లపై విచారణ జరిపారు.
రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



