సూపర్‌మ్యాన్ పేరిట ఆవిష్కరిం చిన యూనిట్రీ సంస్థ
షాంఘై : చైనాకు చెందిన యూనిట్రీ సోమవారం ‘సూపర్‌మ్యాన్’ పేరిట ఓ కొత్త హై-స్పీడ్ రోబోట్‌ను ఆవిష్కరించింది. యూనిట్రీ సంస్థ అమ్మకాల పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద హ్యూమనాయిడ్-రోబోట్ తయారీదారు. గత వారం నిధుల సమీకరణ జరిపిన తర్వాత షాంఘైలో ట్రేడింగ్ ప్రారంభించింది. తూర్పు చైనాలోని హాంగ్‌జౌలో ఉన్న ఈ కంపెనీ కేవలం మూడు నెలల వ్యవధిలోనే కొత్త రోబోట్‌ను అభివృద్ధి చేసింది. ఇది రెండు మీటర్ల ఎత్తు వరకూ దూకగలదు. సెకనుకు 12.66 మీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. పరిగెత్తడం, నృత్యం చేయడం, యుద్ధ కళలను ప్రదర్శించడం ద్వారా ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించిన కంపెనీ హ్యూమనాయిడ్ రోబోట్‌లపై పెట్టుబడిదారుల దృష్టిని ఈ తాజా ఆవిష్కరణ మరింతగా పెంచింది. కంపెనీ ఐపీఓను రిటైల్ పెట్టుబడిదారులు ఎనిమిది వేల రెట్లకు పైగా ఓవర్ సబ్‌స్క్రైబ్ చేశారు. ఇది షాంఘై టెక్ కేంద్రీకృత స్టాక్ మార్కెట్‌లో ఓ రికార్డు.
చైనాలో హై-స్పీడ్ రోబోట్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



