నవతెలంగాణ-హైదరాబాద్: పిల్లలు సోషల్ మీడియా వాడకంపై పలు దేశాల్లో నిషేధం విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేసియా తదితర దేశాలు కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. తాజాగా వాటి బాటలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వెళ్లింది. 15 సంవత్సరాలు ధాటిన వయస్సు పిల్లలు మాత్రమే సోషల్ వాడకానికి అర్హులని స్పష్టం చేసింది. ఈ నిబంధనను అమలు చేసిన తొలి అరబ్ దేశంగా యూఏఈ నిలిచింది .
కొత్త నిబంధనల ప్రకారం 15 ఏళ్లలోపు పిల్లలు వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను సృష్టించుకోవడం, నిర్వహించడం లేదా వాటిలో పోస్టులు చేయడం, కామెంట్లు పెట్టడం, గ్రూపుల్లో చేరడం వంటి కార్యకలాపాలు చేయలేరు. పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి రక్షించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది.



