ఏఎమ్మార్ కంపెనీ హెడ్ ప్రభాకర్ రెడ్డ
నవతెలంగాణ-మల్హర్ రావు
మొక్కల పెంపకంతోనే మానవాళికి మనుగడ ఉంటుందని తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ హెడ్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వన మహోత్సవంలో భాగంగా గురువారం ఓసిపి బ్లాక్-1లో ఏఎమ్మార్ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మానవుల మనుగడ కోసం, పచ్చదనం, పరిశుభ్రత వెలిసేలా మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కె.ఎస్.ఎస్ మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ అధికారి సురేష్ బాబు, ఎస్టేట్ అధికారి రామచంద్రమూర్తి, పర్యావరణ అధికారి శ్రీరామ్ కుమార్, డిజిఎం సర్వోత్తమ్, ప్రాజెక్టు ఇంజనీర్ కిషన్, హెచ్ ఆర్ డిజిఎం రమేష్ బాబు పాల్గొన్నారు.
మొక్కల పెంపకంతోనే మానవాళికి మనుగడ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



