నవతెలంగాణ-ఆలేరు టౌను
హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారిపైన ఆలేరు పట్టణం గుండా నిత్యం వేలాది వాహనాలు ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఆటోలు వెళుతుంటాయి. కొన్ని వాహనాలు పట్టణంలోని బైపాస్ జాతీయ రహదారిపై వెళ్తుండగా.. మరికొన్ని అధికంగా వాహనాలు ఆలేరు పట్టణం గుండా పెదవాగు పురాతనమైన బ్రిడ్జిపై నుండి వెళ్తుంటాయి. ఈ బ్రిడ్జి పై రోడ్డు ఇరుకుగా ఉంటుంది. రెండు బస్సులు గాని లారీలు గాని ఎదురెదురుగా వెళ్లాలంటే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే..
వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. వాహనాలు వాగుపై నుండి పడిన సంఘటనలు ఉన్నాయి. వాహనాలు వెళుతుంటే పాదచారులకు సైతం వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పురాతన బ్రిడ్జి పై నుండి నిత్యం హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లేవారు, వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లేవారు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, ఆలేరు పట్టణనికి నిత్యం వివిధ పనుల నిమిత్తం వేలాదిమంది వచ్చేవారు, ఈ పురాతన బ్రిడ్జి గుండా ప్రయాణిస్తుంటారు. అదేవిధంగా ఆలేరు పట్టణంలోని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి , ప్రభుత్వ కార్యాలయాలు ఐ సి డి ఎస్, ఆర్ డబుల్ ఎస్, పి ఆర్ డి ఈ, ఎంపీడీవో కార్యాలయం, ఏపీఎం, ఏపీవో, వ్యవసాయ మార్కెట్ కార్యాలయాలకు, ఉద్యోగులు, హమాలి కార్మికులు, కర్షకులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేవారు నిత్యం ప్రయాణిస్తుంటారు.
బ్రిడ్జి దాటి వెళ్లాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని అప్రమత్తంగా వెళ్లాల్సిందే. ఇక్కడ ప్రమాద సూచిక బోర్డులు లేవు. బ్రిడ్జి కిరువైపులా రక్షణ గోడా లేదు. ఈ కారణంగా అనేక ప్రమాదాలు గతంలో చోటుచేసుకుని అనేకమంది మృత్యువాత పడ్డారు. అవిటి వాళ్లు ఆయన సంఘటనలు కోకోళ్లలు ఉన్నాయి. రాత్రి అయితే బ్రిడ్జిపై చిమ్మనా చీకట్లు కమ్ముకుంటాయి. లైటింగ్ ఉండదు. పెదవాగు బ్రిడ్జిపై అనేక ప్రమాదాలు తృటిలో తప్పి బతుకు జీవుడా అంటూ తప్పించుకుని ఉన్న సంఘటనలు ఉన్నాయి.
ఇటీవల ఆలేరు పెద్దవాగు బ్రిడ్జి పై తృటిలో తప్పిన పెను ప్రమాదం
జనగామ వైపు నుండి ఆలేరు పట్టణం వైపు ఆర్టీసీ బస్సు వస్తుండగా, ఎదురుగా వస్తున్న బస్సు దారి ఇవ్వకపోవడంతో ఆలేరు నుండి బస్సుకి ఎదురుగా ప్రయాణికులతో వెళ్ళిన ఆటో ఒకసారిగా పక్కకు వెళ్లి బ్రిడ్జిపై ఉన్న రాయికి తగిలింది. ఈ క్రమంలో రాయి వాగులో పడిపోయింది. బ్రిడ్జి చివర అంచులో ఒక్కసారిగా ఆటో ఆగిపోయింది. ఆటోలో ప్రయాణికులు ఉన్నారు. బ్రిడ్జి చివరి అంచు వరకు వెళ్లి ఆటోని అక్కడే ఉన్న స్థానికులు అప్రమత్తమై నిలిచిపోయిన ఆటోని ప్రమాదం నుండి తప్పించారు. ప్రమాదం తృటిలో తప్పింది. ఆటో వాగులో పడిపోతే పెద్ద ప్రమాదం జరిగేది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇరుకైన బ్రిడ్జిని పునర్నిర్మాణ పనులు చేపట్టి ప్రమాదాలు నివరించాలని, వివిధ రాజకీయ పక్షాల, ప్రజా సంఘాల నాయకులు, వాహనదారులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.



